కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో కార్తీ ఒకరు. కార్తీ ఇప్పటికే తమిళనాట ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే కార్తీ తెలుగు లో యుగానికి ఒక్కడు మూవీ ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత కార్తీ నటించిన పలు సినిమాలను తెలుగు లో డబ్ చేసి విడుదల చేయగా అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించాయి. దానితో కార్తీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజీ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా ,  రాసి కన్నామూవీ లో కార్తీ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అక్టోబర్ 21 వ తేదీన మంచి అంచనాల నడుమ తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల అయింది.

ఇది ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ,  ఈ మూవీ 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.88 కోట్ల షేర్ , 9.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో సర్దార్ మూవీ 6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని సక్సెస్ ను అందుకోవడం మాత్రమే కాకుండా ,  38 లక్షల లాభాలను కూడా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: