బుల్లితెర మహారాణి సుమ కెరీర్లోని అన్ని కోణాలు ఈ జెనరేషన్ కుర్రాళ్లకు తెలియదు. ఆమె వాళ్లకు యాంకర్ గానే పరిచయం. కానీ సుమ పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ గా. యాంకర్ కాక ముందు ఆమె ఒక స్టార్ రైటర్ తో రొమాన్స్ చేశారు. మలయాళీ అమ్మాయి అయిన సుమ ఫ్యామిలీ చాలా కాలం క్రితమే హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఆమె తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి కావడంతో ట్రాన్స్ఫర్ పై హైదరాబాద్ రావడం, ఇక్కడే స్థిరపడటం జరిగింది. దీంతో సుమకు తెలుగులో ప్రావీణ్యత వచ్చింది. మలయాళం కంటే తెలుగులోనే సుమ అనర్గళంగా మాట్లాడతారు.
నటనపై ఆసక్తితో తెలుగు, మలయాళ పరిశ్రమల్లో హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సుమకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో 'కళ్యాణ ప్రాప్తిరస్తు' మూవీ తెరకెక్కింది. ఈ మూవీ హీరో ఎవరంటే స్టార్ రైటర్ వక్కంతం వంశీ. హీరో కావాలని ప్రయత్నాలు చేస్తున్న వక్కంతం కూడా సుమతో పాటు వెండితెరకు పరిచయమయ్యారు.

దర్శకుడు దాసరి కావడంతో కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీ మీద అంచనాలుఏర్పడ్డాయి . 1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు నిరాశపరిచింది. సుమ, వక్కంతం వంశీల తొలి ప్రయత్నం ఘోరంగా దెబ్బతింది. ఆ దెబ్బతో వక్కంతం నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యాడు. సుమ మాత్రం రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. వంశీ రచయితగా మారి సక్సెస్ అయ్యారు. సుమ యాంకర్ అయ్యాక ఆమె దశ తిరిగింది.
యాంకర్ కాక ముందు హీరోయిన్ గా వక్కంతం వంశీతో ఆమె ఆడిపాడారు. ఇక సినిమా ప్రయత్నాల్లో ఉన్నప్పుడే రాజీవ్ కనకాలతో పరిచయం, ప్రేమ మొదలయ్యాయి. పెళ్లి చేసుకుంటే సినిమాలు వదిలేయాలని రాజీవ్ కండీషన్ పెట్టడంతో కొన్నాళ్ళు సుమ ఆయనకు దూరమయ్యారట. తర్వాత మరలా కాంప్రమైజ్ కావడం, పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.

వివాహం అనంతరం సుమ బుల్లితెరపై ఫోకస్ పెట్టారు. యాంకర్ గా రంగంలోకి దిగి సూపర్ సక్సెస్ సాధించారు. యాంకరింగ్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సుమ రికార్డ్స్ ఎవరూ బద్దలు కొట్టలేనివి. దశాబ్దాల పాటు తిరుగులేకుండా ఏకఛత్రాధిపత్యం చేయడమంటే మామూలు విషయం కాదు. ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదన సుమ సొంతం.

నటిగా ఫెయిల్ అయిన సుమ తన శక్తి  చావని సుమ పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ఇటీవల జయమ్మ పంచాయితీ మూవీలో లీడ్ రోల్ చేశారు. జయమ్మగా నటించి మెప్పించారు. ఈ చిత్రంలో సుమ నటన ప్రశంసలు అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: