టాలీవుడ్  సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ బిగ్గెస్ట్ మల్టీస్టార్ సినిమా విడుదల ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది.అంతేకాదు  ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా ఆస్కార్ బరిలో కూడా ఉంది.ఇదిలావుంటే తాజాగా త్రిబుల్ ఆర్ జపాన్లో కూడా విడుదలైంది.

అయితే  అప్పుడు కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది.ఇదిలావుంటే ఈ సినిమా ప్రమోషన్ల కార్యక్రమాల కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి జపాన్ లో ఉన్నారు.  అయితే ముగ్గురు  అక్కడ ప్రమోషన్లలో పాల్గొంటూ అక్కడ ఉన్న వీరి అభిమానులను కలుసుకుంటూ… ఈ సినిమాకు సంబంధించిన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక ఈ సందర్భంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది. ఈ సందర్భంగా ఇండియన్ డాన్స్ గురించి ఎన్టీఆర్‌ను అక్కడున్న వారు ప్రశ్న అడగగా.. ఎన్టీఆర్ కూడా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

కాగా  ఎన్టీఆర్ మాట్లాడుతూ 'డాన్స్ అనేది భారతీయుల రక్తంలోనే ఉందంటూ ఆయన సమాధానం చెప్పాడు.అయితే  భారతదేశంలో చిన్నతనం నుంచి అందరూ డాన్స్ నేర్చుకుంటారని, ఇండియాలో ఎందరో గొప్ప డాన్సుర్లు ఉన్నారంటూ ఎన్టీఆర్ చెప్పాడు.అయితే రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ కూడా ఇండియాలో గొప్ప డాన్సర్ అని అలాగే ప్రభుదేవా అనే ఒక గొప్ప కొరియోగ్రాఫర్ ఉన్నారని ఆయనని మేము ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటూ అందరం పిలుస్తామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఇక  ఈ క్రమంలోనే ఈ విధంగా చిరంజీవిని డాన్స్ పరంగా ఇంతవరకు ఎవరు పొగడలేదు.. ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఈ రేంజ్ లో చిరంజీవి డాన్స్ గురించి పొగిడి మెగా అభిమానులను ఫిదా చేశారు.అయితే  దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: