టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మాస్ ఎంటర్టైనర్ 'పుష్ప'.ఇక  గతేడాది విడుదలైన ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు బన్నీ.ఇకపోతే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్ అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే  ఈ సినిమాలో పుష్పరాజ్ గా బన్నీ క్యారెక్టరైజేషన్, యాటిట్యూడ్, డైలాగ్స్ అన్ని విషయాలలో తన సత్తా చూపించేశాడు. 

అంతేకాదు ఇటీవల జరిగిన సైమా, ఫిలింఫేర్ లో బెస్ట్ యాక్టర్ గా అవార్డులు అందుకున్నాడు.అయితే ఈ క్రమంలో పుష్ప 2 మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుండగా.. ఇంతలోనే సినిమాపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. పుష్ప 2లో పుష్పరాజ్, ఎస్సై భన్వర్ సింగ్ షెకావత్ ల మధ్య వార్ ఎలా ఉండబోతుంది? అనేది తెరపై చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.  అంతేకాదు అలాగే సిండికేట్ హెడ్ గా మారిన పుష్పరాజ్ కి, బిజినెస్ పరంగా ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నాయని, ముందు ఇండియా అంతటా కవర్ చేసి.. ఆపై కథ థాయిలాండ్ దేశాలవైపు వెళ్లబోతుందని టాక్.

అయితే..  ఇక ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్న పుష్ప 2 ఇంటర్వెల్ లేదా క్లైమాక్స్ లో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ ఎంటర్ అవ్వనుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ఇదిలావుంటే ఇక సుకుమార్ కూడా పుష్ప మూవీని సీక్వెల్ వరకే ఆపకుండా పుష్ప-3 కూడా ప్లాన్ చేస్తున్నాడట.అయితే  అందుకే పుష్ప 2లో కొత్త క్యారెక్టర్ ని పరిచయం చేసి.. ఆ క్యారెక్టర్ ద్వారా పుష్ప 3కి లీడ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు  తాజా సమాచారం ప్రకారం.. పుష్ప 2లో కొత్త క్యారెక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చేది మెగాస్టార్ చిరంజీవి అని సినీవర్గాలలో రూమర్స్ వినిపిస్తున్నాయి.ఇక  అలాగే మెగాస్టార్ ఎంట్రీ కూడా ఇదివరకు చూడని విధంగా సుకుమార్ స్టైల్ లో మాస్ గా ఉండబోతుందని.. అటు బన్నీ ఫ్యాన్స్ కి, ఇటు మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ లా ఉంటుందని అంటున్నారు. అయితే  ఇందులో ఎంత వాస్తవం ఉందనేది మేకర్స్ క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.  ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: