ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలలో నటించినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపవుతున్నాయి.రాజ్ తరుణ్ నటించిన కొన్ని సినిమాలు థియేటర్లలో ఎప్పుడు విడుదలయ్యాయో ఆయన అభిమానులకు కూడా తెలియదంటే ఆ సినిమాల పరిస్థితి ఏంటో సులువుగానే అర్థమవుతుంది.

అయితే రాజ్ తరుణ్ ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో ను పోస్ట్ చేయ గా ఆ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.రాజ్ తరుణ్ ఆ వీడియోలో ఒక అమ్మాయి గురించి మీకు చెప్పడం కోసమే అకస్మా త్తుగా ఈ వీడియో చేస్తున్నా నని నా లైఫ్ లో అమ్మాయి గురించి మాట్లాడే ఛాన్స్ వస్తుందని ఎప్పుడూ అనుకో లేదని పేర్కొన్నారు.నా లైఫ్ కు లవ్ సెట్ కాదని భావించి పెళ్లి చేయమని పేరెంట్స్ ను కోరానని రాజ్ తరుణ్ అన్నారు.పేరెంట్స్ మంచి పెళ్లి సంబంధం చూశారని అయితే పెళ్లిరోజున అ మ్మాయి జంప్ అని రాజ్ తరుణ్ అన్నారు.

ఆ సమయంలో చుట్టాలంతా సానుభూతి తో చూ శారని ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా వదలనని రాజ్ తరుణ్ పేర్కొ న్నారు.ఆ అమ్మాయి అంతు చూస్తానని ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా పట్టుకుం టానని రాజ్ తరుణ్ చెప్పు కొచ్చారు.రేపే అమ్మాయి ఫోటో ఆన్ లైన్ లో పెడుతున్నానని అమ్మాయి కనిపిస్తే చెప్పాలని రాజ్ తరుణ్ పేర్కొ న్నారు.రాజ్ తరుణ్ తన కొత్త సినిమా ప్రమోషన్ల లో భాగం గా ఈ విధంగా వీడియో చేశాడని తెలుస్తోంది.

అయితే సెలబ్రిటీలు ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేయడం ద్వారా సినిమాల కు చెడు ఎక్కువగా జరుగు తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వరుస ఫ్లాపుల నేపథ్యంలో రాజ్ తరుణ్ కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: