
మంచు విష్ణు సినిమా లు అంటే ఒక వర్గం ప్రేక్షకులు మరి దారుణం గా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ కారణం గానే సినిమా ను చూసేందుకు సాధారణ జనాలు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదేమో అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరేం చేసినా కూడా మంచు విష్ణు నటించిన మాత్రం ఆపేది లేదు అన్నట్లుగా తన తదుపరి సినిమా కు సంబంధించిన కథ ను వింటున్నట్లుగా తెలుస్తోంది. దేనికైనా రెడీ తరహా కామెడీ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ కోసం మంచు విష్ణు కథలు వింటున్నాడనితెలుస్తోంది. స్వతహాగా మంచి కథకుడు ఆయన మంచు విష్ణు తాను కూడా కొన్ని స్టోరీ లైన్స్ ని రాసుకుంటున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. వచ్చే సంవత్సరం ఆరంభం లో సినిమా గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మంచు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈసారైనా మంచు విష్ణు కి సక్సెస్ దక్కేనా చూడాలి.