సూపర్  స్టార్ మహేష్ బాబు బావ అని  లెజెండరీ మాస్  హీరో కృష్ణ గారి అల్లుడు అని కాదు గాని సుధీర్  బాబు కూడా మంచి ప్రతిభ గల హీరోగా నిరూపించుకున్నాడు.కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నన్ను దోచుకుందువటే, సమ్మోహనం లాంటి సినిమాలు సుధీర్ బాబుకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.తన మైనస్‌లన్నింటినీ ఆ సినిమాలతో దాదాపుగా అధిగమించాడతను. మహేష్ బాబు తెర వెనుక సపోర్ట్ ఉన్నప్పటికీ.. సొంతంగా అవకాశాలు అందుకునే స్థాయికి చేరుకున్నాడు.కానీ కమర్షియల్ గా మాత్రం సుధీర్ కి మంచి బ్రేక్  అనేది రాలేదు.ఈమధ్య వరుసగా ఫ్లాపులు ఎదురువుతున్నాయి. అలా అని సుధీర్‌కు అవకాశాలకేమీ కొదవ లేదు. 'సమ్మోహనం' తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణతో 'వి' అనే మరో సినిమా చేశాడు సుధీర్.


నాని కూడా నటించిన ఈ సినిమాను ఇంద్రగంటి తన స్టైల్‌కు భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్‌గా తీశాడు. కానీ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. ఓటీటీలో రిలీజైనప్పటికీ.. దీని రెస్పాన్స్ చూస్తే డిజాస్టర్ అనే చెప్పాలి.ఇక గత ఏడాది 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్. అది కూడా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరే అయింది. ఈ రెండు చిత్రాల్లోనూ సుధీర్ నటనకు ప్రశంసలు వచ్చాయి. కానీ ఫలితం లేకపోయింది. ఇటీవలే తన ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటితో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అంటూ మరో క్లాస్ మూవీ చేసి ప్రేక్షకులను పలకరించాడు సుధీర్. అది కూడా తుస్సుమనిపించింది. 


కానీ సినిమాలు వరుసగా పోతున్నా సుధీర్‌కు ఛాన్సులకైతే లోటు లేదు.దానికి కారణం ఆయన నటన, అందం. అయినా సూపర్  స్టార్ వంశానికి పడి లేవటం అనేది అలవాటే. ఒక్క సారి లేచారంటే బాక్స్ ఆఫీస్ బద్దలే. అది చాలా సార్లు కృష్ణ, మహేష్ నిరూపించారు. ఇప్పుడు సుధీర్ కూడా అందుకు సిద్ధం అయ్యాడు.ఆల్రెడీ భవ్య క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థలో 'హంట్' అనే యాక్షన్ మూవీ చేశాడు. అది విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే రిలీజైన దాని టీజర్ ఆకట్టుకుంది. దీంతో పాటుగా నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో 'మాయా మశ్చీంద్ర' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు సుధీర్ హీరోగా ఇంకో సినిమా అనౌన్స్ అయింది. జ్ఞానశేఖర్ అనే కొత్త దర్శకుడితో అతను చేస్తున్న ఈ సినిమాకు 'హరోం హర' అనే టైటిల్ ఖరారు చేశారు. దీని టైటిల్ వీడియో చూస్తే సుధీర్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు భిన్నంగా డివోషనల్ యాంగిల్లో సాగే సినిమాలా కనిపిస్తోంది. 1989 నాటి కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇదట.పాన్  ఇండియా రేంజిలో ఈ సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: