టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విజయాలు ఇప్పుడు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సినిమాలు విడుదలయ్యే చిత్ర పరిశ్రమగా పేరుగాంచిన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పుడు విజయాల శాతం కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఆ విధంగా తెలుగులో ఎక్కువగా ఒక జోనర్ లో సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతూ ఉండడం విశేషం. ఆ విధంగా ఆ జోనర్లో వచ్చిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డివోషనల్ కంటెంట్ ఉంటే తప్పకుండా ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ఆ విధంగా గత రెండు సంవత్సరాలుగా ఇప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమలో విడుదలైన డివోషనల్ కంటెంట్ సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరచలేదు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవల నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ రెండవ భాగం సినిమా డివోషనల్ కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా మంచి ప్రేక్షకులను అందుకుంది. ఈ సినిమాకు తెలుగులో కంటే ఎక్కువగా నార్త్ లోనే మంచి ఆదరణ దక్కింది అని చెప్పాలి.

ఆ విధంగా తాజాగా కన్నడ నుంచి విడుదలైన కాంతారా సినిమా కూడా డివోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఇప్పుడు దుమ్ము దులిపే కలెక్షన్లను అందుకుంటుంది. తెలుగు హిందీ భాషలలో ఈ సినిమాకు దాదాపు 100 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రావడం విశేషం. అంతకుముందు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాతో భారీ విజయం దక్కించుకుంది. టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో ఈ చిత్రం కూడా డివోషనల్ కంటెంట్ తోనే ప్రేక్షకులు ముందుకు వచ్చిందని చెప్పాలి. ఇకపోతే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలాంటి జోనర్ లో ఇటీవల రెండు మూడు సినిమాలు విడుదలయ్యాయి కానీ పేరుకు డివోషనల్ సినిమాలే అయినా కూడా అందులో భక్తికి సంబంధించిన అంశాలు చాలా తక్కువగా ఉండడంతో అవి ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి. మరి భవిష్యత్తులో ఇలాంటి జోనల్లో వచ్చే సినిమాలు ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: