టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంతోష్ శోభన్ ఇప్పటికే పేపర్ బాయ్ , ఏక్ మినీ కథ , మంచి రోజులు వచ్చాయి వంటి మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఏక్ మినీ కథ మూవీ థియేటర్ లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా సంతోష్ శోభన్ "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ,  మేర్లపాక గాంధీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్ట్ డ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం పరవాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్ అనే మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ దక్కించుకున్నట్లు , కొన్ని వారాల థియేటర్ రన్ తర్వాత ఈ మూవీ ని సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రహ్మాజీ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  ప్రవీణ్ లక్కరాజు ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: