టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సేన్ తాజాగా ఓరి దేవుడా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిథాలీ పల్కర్ హీరోయిన్ గా నటించగా ,  అశ్విత్ మరిముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఓరి దేవుడా మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు దక్కాయి. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఓరి దేవుడా మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఓరి దేవుడా మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. తాజాగా ఆహా "ఓ టి టి" సంస్థ ఈ మూవీ ని ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ ని ఎవరైనా థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు అర్ధరాత్రి నుండి ఈ సినిమా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: