రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అవుతున్నా , ఈ మూవీ కి "వి ఎఫ్ ఎక్స్" పనులు అత్యధికంగా ఉండడం వల్ల ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అవుతున్న ఇప్పటికి కూడా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  కొంత కాలం క్రితమే ఈ మూవీ నుండి ప్రభాస్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను మరియు టీజర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లకు మరియు టీజర్ కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది.

ఇది ఇలా ఉంటే 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే మళ్లీ ఈ సినిమాను 2023 వ సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయడం లేదు అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆది పురుష్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని మళ్లీ రీ షూట్ చేయబోతున్నారు అని , దాదాపు ఆది పురుష్ మూవీ ని 30 శాతం మేర రీ షూట్ చేయబోతున్నారు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ పై భారతదేశం వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఇలా భారీ మొత్తం లో అంచనాలు కలిగి ఉన్న ఆది పురుష్ మూవీ తో ప్రభాస్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: