ఒకప్పుడు సినిమాలో ఛాన్స్ రావాలంటే ఎంతో కష్ట పడేవాల్లు.. కానీ ఇప్పుడు అందాలను ఎవరూ ఎక్కువ ఆరబోస్తే వారికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తున్నారని ఇటీవల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.. ఎలా ఛాన్స్ వచ్చినా కూడా వచ్చిన తర్వాత వివాదాల్లొ చిక్కుకొని నిత్యం వార్తల్లో నిలిచే వాళ్ళు కూడా లేకపోలేదు.. కాంట్రవర్సీ తో వార్తలో నిలిచే వారిలో ముందు వరుస లో ఉంటారు హీరోయిన్ రాధిక ఆప్టే. వ్యక్తిగత జీవితాని కి సంబంధించి, ఇండస్ట్రీ గురించి ఆమె చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటాయి.
ప్రస్తుతం బాలీవుడ్ కే పూర్తిగా పరిమితమైన రాధిక.. తెలుగు లో లెజెండ్, రక్త చరిత్ర వంటి చిత్రాల తో తెలుగు వారికి సైతం చేరువైంది. లయన్ చిత్రం తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ తెర పై కనిపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఇండస్ట్రీ లో హీరోయిన్ల విషయం లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ అంతా యంగ్ హీరోయిన్ల నే తీసుకోవాలని భావిస్తున్నారన్న రాధికా.. ఈ కారణం గా తాను కొన్నిసార్లు ఆఫర్లు చేజార్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
హీరోయిన్ల కు ఆఫర్లు రావడం లో వయసు కూడా ప్రభావాన్ని చూపిస్తోందన్న ఈ ముద్దుగుమ్మ.. కమర్షియల్ చిత్రాల్లో యంగ్ హీరోయిన్స్‌ని ఆఫర్లు రావడానికి ఇదే కారణమన ని చెప్పుకొచ్చింది. హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలు లేవనే కామెంట్స్ ఇండస్ట్రీ లో కామన్‌గా మారాయి అని రాధిక తెలిపింది.. అంతేకాదు.. సినిమాల్లో ఆఫర్ల కోసం సర్జరీలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ప్రతిభను కాకుండా ఫిజిక్ ను బట్టి అవకాశాలివ్వడం ఒక్క ఇండియా లో నే కాకుండా విదేశాల్లో నూ ఉంది. ఇప్పుడిప్పుడే దీనికి వ్యతిరేకంగా మహిళలు గళం విప్పుతున్నారు’ అని చెప్పుకొచ్చింది... మరి సినిమా అవకాశాలు వస్తాయో రావో చూడాలి...