
అయితే ఈ సినిమాని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా సమయం తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నది.. ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందని చిత్ర బృందం తెలియజేస్తూ ఉన్నారు.తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ఈ సినిమా వరల్డ్ సెట్ ప్ ,మేకింగ్ ,ప్రాపర్టీస్ ,ప్రతిదీ పూర్తిగా కొత్తగా ఉంటుందని తెలియజేశారు.
ప్రాజెక్ట్-k అనేది చాలా కొత్త సినిమా స్క్రిప్ట్ కూడా చాలా కొత్తగానే ఉంటుందని తెలియజేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. బిల్డప్ చేసే వరల్డ్ టెక్నికల్గా అన్ని కొత్తవేనని ఒక రకంగా ఈ సినిమా ఎలా చేయాలి అన్నదానికి చాలా టైం పడుతోందని డైరెక్షకుడు తెలియజేశారు. ఈ సినిమా కోసం అన్ని కూడా కొత్తగా తయారు చేస్తున్నామని తెలియజేశారు. అయితే మహానటి సినిమాలో కార్లు కావాలంటే రెంటుకు తీసుకువచ్చారని కానీ ఈ సినిమాకు.. వెహికల్ కావాలంటే ఎక్కడా దొరకవని కార్లు తయారీ చేసుకోగలగాలి అనిట్ తెలియజేశారు డైరెక్టర్. ఇక మహేంద్ర గ్రూపు సంస్థ నుండి వీరికి అన్ని సమకూరుస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్ల కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో అమితాబచ్చన్, దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.