మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ సృష్టించిన అద్భుత క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం మూవీ గురించి ఇండియా అంతటా తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరియు మీనాలు నటించిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో దీనికి సీక్వెల్ గా దృశ్యం 2 ను తెరకెక్కించారు. ఇది కూడా ప్రేక్షకులను ఎక్కడా నిరాశపరచకుండా మంచి వసూళ్లను సాధించింది. ఈ రెండు పార్ట్ లను తెలుగులోనూ రీమేక్ చేశారు, ఇందులో వెంకటేష్ హీరోగా మరియు మీనా హీరోయిన్ గా నటించి మెప్పించారు. తెలుగులోనూ సేమ్ రిజల్ట్ రిపీట్ అయింది, తమిళ్ లోనూ ఈ సినిమా రీమేక్ అయ్యి సక్సెస్ ను అందుకుంది.

ఇప్పటికే అన్ని భాషలలోనూ హిట్ అయిన దృశ్యం సీక్వెల్ ను కష్టాలలో ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ప్రయత్నం చేసింది. అయితే దృశ్యం సినిమా ఇప్పటికే మూడు భాషలలో రావడం... ఓటిటి లలోనూ సందడి చేసి సక్సెస్ ను అందుకోవడంతో ఏ మేరకు బాలీవుడ్ మేకర్స్ ఐడియా వర్క్ అవుట్ అవుతుంది అని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే ఒక మంచి కథను సరిగ్గా డీల్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితం అయింది. ఈ సినిమాను అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేయగా, అజయ్ దేవగన్, శ్రియ, అక్షయ్ ఖన్నా మరియు టబు లు కీలక పాత్రలు చేశారు.  

కాగా నిన్న మార్నింగ్ షో నుండి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మంచి కలెక్షన్ లను సాధిస్తాయని నమ్మకంతో చిత్ర బృందం ఉందట. నిన్న రాత్రి అదనపు షో లు కూడా వేశారంటే సినిమాకు ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారీ కలెక్షన్ లు వచ్చినా రాకపోయినా బ్రహ్మాస్త్ర తర్వాత హిట్ అయిన సినిమాగా దృశ్యం 2 ను చెప్పుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: