తాజాగా సంగీత "మసుద" అనే హర్రర్ జోనర్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అత్యంత ఆకట్టుకునే విధంగా ఉండడం తో మసుద మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ మసుద మూవీ నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ లభించింది. దానితో మసుద మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మసుద మూవీ ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.

నైజాం : 1.32 కోట్లు .
సీడెడ్ :  35 లక్షలు .
ఆంధ్ర :  1.48 కోట్లు .
3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మసుద మూవీ 1.70 కోట్ల షేర్ , 3.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మసుద  మూవీ  1.80 కోట్ల షేర్ , 3.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సాయి కిరణ్ రచన మరియు దర్శకత్వం వహించగా , రాహుల్ యాదవ్ నక్క ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ కి నగేష్ బానెల్ సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయగా ,  జెస్విన్ ప్రభు  ఈ మూవీ కి ఎడిటర్ గా పని చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: