టాలీవుడ్ లో ఒక నటుడు లేదా నటి ఎదగాలంటే మాములు విషయం కాదు. మనకు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం రావాలి, ఆ అవకాశం కోసం ఏళ్ళు ఎదురుచూసినా ఇంకా అవకాశం దక్కని వాళ్ళు లక్షల మంది కృష్ణ నగర్ వీధుల్లో కనబడుతారు. అంతకన్నా దారుణమైన స్థాయి నుండి తన ప్రతిభతో హీరోగా మారి కష్టపడితే దక్కనిది అంటూ ఏదీ ఉండదు అని ఎంతోమందికి ఒక ఉదాహరణలా మారాడు ప్రముఖ కమెడియన్ మరియు హీరో సుడిగాలి సుధీర్. తన జీవితంలో సుధీర్ పేరు కన్నా సుడిగాలి సుధీర్ అన్న పేరు తర్వాతనే సుడి వచ్చింది ఈ విషయం అందరికీ తెలిసిందే.

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి జీవనాధారం కోసం మ్యాజిక్ చేసుకునే సుధీర్ మెల్ల మెల్లగా తన స్నేహితుల సహాయంతో మల్లెమాల వారు చేస్తున్న జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా మారాడు. ఎంతగా అంటే తన కోసమే వారంలో ఒక్కసారి వచ్చే జబర్దస్త్ ను ప్రేక్షకులు చూసేంతలా ! అలా మొత్తం 21 సినిమాల్లో కమెడియన్ గా చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ తర్వాత ఇతనిలో ఏదో మ్యాజిక్ ఉందని గ్రహించిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి సుధీర్ హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ఎవ్వరికీ ఆశించిన మేర సంతృప్తిని ఇవ్వలేదు. ఆ తర్వాత వరుసగా 3 మంకీస్ వాంటెడ్ పండుగాడు అన్న సినిమాలు తీసినా ఫలితం లేకుండా పోయింది. తన మొదటి సినిమా డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈసారి మంచి మాస్ కథతో సుధీర్ ను "గాలోడు" ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

సినిమా గత వారమే రిలీజ్ అయింది.. ఈ సినిమా మొదటిరోజు ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చినా తన స్టైల్ మరియు యాక్షన్ తో ప్రేక్షకులను థియేటర్ కు రప్పించుకుంటున్నాడు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 2.45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, ఇప్పటికే మూడు కోట్ల మేర కలెక్షన్ లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో సుధీర్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లయింది. ఇకపై వచ్చే అమౌంట్ అంతా లాభం కిందకే వస్తుంది. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 8 కోట్లు అయినా కలెక్ట్ చేస్తుందని సినీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. దీనితో గాలోడు సుధీర్ కు మరింతగా క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: