
ఆ సమయంలో కొత్తగా ఆలోచించిన కొందరు తమ సినిమాలను ఓటిటి ల ద్వారా విడుదల చేయడంతో అది ప్రేక్షకులకు బాగా నచ్చింది. దానితో ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు పోటెత్తి వస్తున్నారు. ఇక కరోనా తర్వాత బాలీవుడ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. ఈ మధ్య వచ్చిన దృశ్యం 2 రీమేక్ మాత్రమే కోట్ల కలెక్షన్ లను సాధించి కొంచెం బాలీవుడ్ కు కొత్త ఊపిరి పోసింది.ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడ్డాయి. అందుకే రానున్న సినిమాలపై బాలీవుడ్ వర్గాలు ఆసక్తిని కనబరుస్తున్నారు.
కాగా షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్ గురించి నెట్టింట్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. షారుఖ్ గత మూవీ జీరో కూడా డిజాస్టర్ గా మిగలడంతో కనీసం ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడా అంటూ ఫ్యాన్స్ ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక మిశ్రమ స్పందన రావడంతో పఠాన్ పై ఫ్యాన్స్ లో ఒకింత నిరాశ కలిగింది అని చెప్పవచ్చు. ఇది మాత్రమే కాక రీసెంటుగా ఈ సినిమా గురించి వచ్చిన అప్డేట్ పట్ల కూడా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఎందుకంటే గ్రాఫిక్స్ విషయంలో ఇప్పటికే సాహో లో ఈ తరహా గ్రాఫిక్స్ ను చూశాము అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి పఠాన్ కథ విషయంలో అయినా మెప్పిస్తుందా లేదా అన్న విషయంపై ఫ్యాన్స్ మరియు బాలీవుడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నారు.