తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి సాయి దరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి దరమ్ తేజ్ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీnలో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అలాగే ఈ యువ హీరో నటించినటువంటి సినిమాలలో పిల్లా నువ్వు లేని జీవితం , సుప్రీమ్ , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , సోలో బతికే సో బెటర్ , ప్రతిరోజు పండగే మూవీ లు మంచి విజయాలు సాధించాయి. ఈ మూవీ లతో  సాయి దరమ్ తేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే సాయి దరమ్ తేజ్ , దేవా కట్టా దర్శకత్వంలో తేరకేక్కిన రిపబ్లిక్ అనే మూవీ లో హీరో గా నటించాడు. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోక పోయినప్పటికీ ఈ మూవీ ద్వారా  సాయి దరమ్ తేజ్ కు మరియు దేవ కట్టా కు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ , కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తేరక్కేకుతున్న ఓ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే
 ఈ మూవీ సాయి దరమ్ తేజ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఎస్డిటి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి టైటిల్ గ్లిమ్ప్స్ డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: