
బాలీవుడ్ లో కాస్త డిఫరెంట్ గా కనిపించే హీరోయిన్ మలైకా అరోరా.బాలీవుడ్ లో ఐటమ్ బాంబ్ గా పేరున్న ఈమె ఫైర్ బ్రాండ్ కూడా. ముఖ్యంగా మలైకా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ సాగిస్తున్న ప్రేమాయణం కారణంగా బాలీవుడ్ వర్గాలతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా హాట్ టాపిక్ గామారింది.వీరిది మామూలు ప్రేమ అయితే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కాని మలైకా అరోరా కంటే పదేళ్లకు పైనే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో.. సహజీవనం చేయడం .. చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం అందరికి ఆశ్చర్యం కలిగించే విషయం. దాంతో వీరి గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ అటు ఇండస్ట్రీలో.. ఇటు మీడియాలో వస్తూనే ఉంటుంది.ఇక మలైకా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్‌ఖాన్ ను పెళ్లాడి.. 18 సంవత్సరాలు కాపురం చేసి.. బిడ్దను కన్న తరువాత ఆయనతో విడాకులు తీసుకుంది. పెళ్లి బంధాన్ని తెగతెంపులు చేసుకున్న మలైకా అరోరా గత కొన్నేళ్లుగా అర్జున్‌కపూర్‌తో సహజీవనం చేస్తున్నది. తనకంటే చిన్నవాడైన యువకుడితో లివ్ఇన్ రిలేషన్లో ఉందంటూ ఆమెపై సోషల్‌మీడియాలో ట్రోల్స్ కూడా వస్తుంటాయి.
మామూలుగా కాదు.. రకరకాలుగా మలైకాపై సోషల్ మీడియాలో కామెంట్ల దాడి చేశారు.. చేస్తూనే ఉన్నారు నెటిజన్లు. ముఖ్యంగా సల్మాన్ ఫ్యాన్స్ ఆమెను గట్టిగాటార్గెట్ చేశారు. అందులోనే ఈ ఇద్దరి స్టార్లపై రకరకాల న్యూస్ లు వైరల్ అవుతూనే ఉన్నాయి. విడిపోతున్నారని, పెళ్ళి చేసుకోబోతున్నారని... ఇలా రకరకాల వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి.వీటిపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది మలైకా అరోరా. తన విషయంలో రోజూ వస్తోన్న ట్రోల్స్ కు తాను అలవాటు పడిపోయానంటోంది. చాలా కాలం వాటిపై స్పందించి..ఎంత ఘాటుమాటలు అన్నా.. ఆగడం లేదని.. ఇలా పట్టుకుని ఉండటం కంటే వదిలేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది అంటోంది మలైకా.
ఇప్పుడు ఉన్న సమాజంలో ద్వంద్వ విలువలుంటాయి. పురుషుడు తనకంటే ఇరవై, ముప్పై ఏండ్లు తక్కువ వయసున్న స్త్రీని ప్రేమిస్తున్నా సమాజం అభ్యంతరం చెప్పదు. అదే స్త్రీ తనకంటే పదేళ్లు చిన్నవయసు వాడి ప్రేమలో ఉంటే చులకన భావంతో చూస్తుంది.. అంటూ అర్జున్ కపూర్ తో రిలేషన్ పై స్పందించింది.అంతే కాదు .. ఇలాంటి సమాజాన్ని తాను పట్టించుకోను అంటోంద మలైకా. సమాజం ఏమనుకున్నా.. తన కుటుంబం, సన్నిహితులు మాత్రం అర్జున్ కపూర్‌తో బంధం పట్ల చాలా సంతోషంగా ఉన్నారట. అయితే ఈ మధ్య వస్తున్న వార్తల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది బ్యూటీ. పెళ్ళి గురించి ప్రస్తావణ రాగా... పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పింది.