తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల క్రితం అద్భుతమైన క్లాస్ హీరోగా ఇమేజ్ ను సంపాదించుకున్న జగపతి బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలా ఎన్నో క్లాస్ ఫిలిమ్స్ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఎన్ని మూవీ లలో నటించినా కూడా సరైన విజయం ఈ హీరో కు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించలేదు. దానితో జగపతి బాబు హీరో పాత్రల్లో మాత్రమే కాకుండా ఇతర పాత్రలపై కూడా ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన లెజెండ్ మూవీ లో జగపతి బాబు ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం , అలాగే ఈ మూవీ లో జగపతి బాబు ప్రతి నాయకుడి పాత్రకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించడంతో , ఈ మూవీ ద్వారా జగపతి బాబు కు విలన్ పాత్రులు మరియు ఇతర ముఖ్యమైన పాత్రలు అనేకం లభించాయి. కేవలం జగపతి బాబు తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా ప్రస్తుతం నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా జగపతి బాబు కు తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి క్రేజీ సినిమా ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. ఆయుష్ శర్మ హీరో గా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ మూవీ లో జగపతి బాబు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అని ఆయుష్ తెలిపాడు. అలాగే జగపతి బాబు నటన అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: