అజిత్ కుమార్ కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం తునివు.. 2023 జనవరి 11వ తేదీన సంక్రాంతి బరిలో దిగబోతోంది ఈ సినిమా.. ఇప్పటికే యూకే లో భారీ స్థాయిలో బుకింగ్స్ కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన వెంటనే 2023 జనవరి చివరి వారానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. తాజాగా ఈ సినిమాకు ఏ కె 62 అని తాత్కాలికంగా పేరు పెట్టి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.


ఇకపోతే తాజా నివేదికల ప్రకారం ఏ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో త్రిష కృష్ణన్ కీలకపాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో గనుక ఈమె నటించినట్లయితే అజిత్ తో కలిసి తనకు ఐదవ చిత్రం కావడం గమనార్హం.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ మాత్రం తన భార్య,  లేడీ సూపర్ స్టార్ నయనతారను ఈ సినిమాలో భాగం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అధికారికంగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు.  త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రధాన ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తోంది.

విగ్నేష్ శివన్ సిగ్నేచర్ హ్యూమర్ టచ్ తో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అనిరుధ్ రవిచంద్ర ఈ ప్రాజెక్టుకి సంగీతం అందించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.  అంతేకాదు ఇక్కడ మరొక ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అజిత్ కి పోటీగా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అజిత్ 62వ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయినా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తూనివు సినిమా తెలుగులో తెగింపు పేరుతో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వెంటనే అజిత్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: