కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి యాష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . యాష్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందు కొని దేశ వ్యాప్తంగా అద్భుత మైన క్రేజ్ ను అనేక మంది అభిమానుల మనసు దోచుకున్నాడు . ఇది ఇలా ఉంటే కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటికి కూడా యాష్ తన తదుపరి మూవీ ని ఏ దర్శకుడు తో చేయబోతున్నది మాత్రం అధికారికంగా ప్రకటించ లేదు . కొన్ని రోజుల క్రితం కన్నడ సినిమా ఇండస్ట్రీ లో మఫ్టీ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నర్తన్ అనే దర్శకుడు యాష్ తో మూవీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

కాకపోతే ఈ ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వెలుబడ లేదు. ఇది ఇలా ఉంటే యాష్ తదుపరి మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా యాష్ బెంగళూరు లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో భాగంగా 700 మంది అభిమానులతో యాష్ వేరు వేరుగా సెల్ఫీలు దిగాడు. గ్రూప్ సెల్ఫీ తీసుకోవాలని ఈవెంట్ నిర్వాహకులు సూచించగా , యాష్ మాత్రం తన అభిమానులతో వేరు వేరుగా ఫోటోలు దిగాడు. ఇలా కన్నడ స్టార్ హీరో యాష్ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: