
ఇక గ్రాండ్ ఫినాలేలో కూడా ఆడియన్స్ అంతా నెల నుంచే రేవంత్ విన్నర్ అని సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటే చివర్లో నాగార్జున టైటిల్ విజేత రేవంతే కానీ ఓటింగ్ ప్రకారం మాత్రం శ్రీహానే టాప్ లో ఉన్నాడని ట్విస్ట్ ఇచ్చాడు. శ్రీహాన్ నాగార్జున ఇచ్చిన గోల్డ్ మాక్స్ ఆఫర్ ని తీసుకుని 40 లక్షలు అందుకున్నాడు. దానితో రేవంత్ యునానిమస్ గా విన్నర్ అని ప్రకటించారు. రేవంత్ కన్నా శ్రీహాన్ కి ఎక్కువ ఓటింగ్స్ నిజంగానే వచ్చాయా.. బిగ్ బాస్ టీం ఆడియన్స్ ఓటింగ్ ని ఎందుకు ఇలా లైట్ తీసుకుందంటూ ఫైర్ అవుతున్నారు.
అంతేకాదు ఇక మీదట బిగ్ బాస్ చూసే అవసరం లేదని.. వళ్లకి ఇష్టం వచ్చినట్టు చేసేట్టు అయితే మనం ఓటింగ్ కూడా వేయాల్సిన పనిలేదని అనుకుంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 6 నిజంగానే ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. నాగార్జున కూడా ఫైనల్ ఎపిసోడ్ ని తూతూ మంత్రంగానే కానిచ్చాడు అన్నట్టు అనిపించింది. టైటిల్ విన్నర్ ఎనౌన్స్ మెంట్ కూడా ఏదో మొక్కుబడిగా చెప్పడం జరిగింది. సో బిగ్ బాస్ టీం ఈ విషయాల మీద చాలా జాగ్రత్తపడాల్సి ఉంటుంది లేకపోతే చాలా నష్టం జరుగుతుందని చెప్పొచ్చు.