రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ఎలాంటి హడా విడి లేకుండా ప్రారంభం అయింది . ఈ మూవీ లో సంజయ్ దత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , మాళవిక మోహన్ , నీది అగర్వాల్ ,  రీద్ధి కుమార్ లు ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ లుగా నటించబోతున్నారు. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది .  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు కేవలం 8 రోజుల మాత్రమే పూర్తి అయినట్లు తెలుస్తోంది . ఈ 8 రోజుల్లో ఈ మూవీ యూనిట్ కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ 24 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ లో కూడా ఈ మూవీ యూనిట్ చాలా కీలకమైన సన్నివేశాలను రూపొందించ బోతున్నట్లు సమాచారం . అలాగే ఈ మూవీ యూనిట్ మెగాస్టార్ చిరంజీవి హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య మూవీ కోసం వేసిన భారీ సెట్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ని 2024 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: