మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలకు కొత్త జీవితాన్ని ఇచ్చింది ఈ షో. ప్రతి ఏడాది ఈ సీజన్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఆరవ సీజన్ కి మాత్రం గట్టి ఎదురుదెబ్బ పడింది అని చెప్పాలి.మొదటి ఎపిసోడ్ నుండి దారుణమైన నెగెటివిటీని అందుకున్న ఈ షో టిఆర్పి రేటింగ్స్ రావడం ఎలిమినేషన్ విషయంలో అన్యాయపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ సీజన్ కి శాపంగా మారింది.

 అందుకే ఏడవ సీజన్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయాలని ప్లాన్  లో ఉన్నారట బిగ్ బాస్ టీం. ఇక ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్నవాళ్లే హోస్ట్.. కూడా మారిపోతున్నాడు. సీజన్ 1 కి జూనియర్ ఎన్టీఆర్ , 2  కి నాని సీజన్ 3 నుండి ఆరవ సీజన్ వరకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే. వీటితోపాటు బిగ్ బాస్ ఓటిటి షో కి కూడా నాగార్జున నే  హోస్ట్ గా చేయడం జరిగింది. సీజన్ 6 తప్ప అన్ని షోలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే సీజన్ 7 కి నందమూరి బాలకృష్ణని హోస్ట్‌గా తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్  టీం.

అయితే ఇటీవల బాలకృష్ణ ని కలిసి ఆయనని ఒప్పించి అగ్రిమెంట్ కూడా తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య అన్ స్టాపబుల్ షో ద్వారా హోస్ట్ గా ఎంతో సక్సెస్‌ను అందుకున్నారు. ఆయనలోని కొత్త యాంగిల్ ను ఈ షో ద్వారా చూపించాడు నందమూరి బాలకృష్ణ. దీనికి గాను బిగ్ బాస్  రియాలిటీ షో కి బాలయ్యని హోస్ట్ గా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక దానికోసం బాలయ్యకి 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనిరేషన్ ఇస్తున్నారని వార్తలు సైతం ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బిగ్ బాస్ హిస్టరీలోనే అత్యధిక పారితోషకం అందుకున్న హోస్ట్‌గా బాలయ్య నిలిచిపోయాడు. దీంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి బాలయ్య తీసుకున్న రెమ్యూనరేషన్ కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: