బిగ్ బాస్ తెలుగు సక్సెస్ ఫుల్ గా ఆరు సీజన్ లను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 సీజన్లకు ముగ్గురు హోస్ట్ లు చేశారు. మొదటి సీజన్ ని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన చలాకీ తనంతో హోస్టింగ్ కే వన్నె తెచ్చాడు. బిగ్ బాస్ షో తెలుగులో గ్రాండ్ గా వచ్చింది అంటే అది తారక్ హోస్ట్ వల్లే అని చెప్పొచ్చు. ఇక సీజన్ 2ని నాని హోస్ట్ చేశారు. నాని మార్క్ చూపించడానికి ఎంత ప్రయత్నించినా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు.

ఇక థర్డ్ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా వచ్చారు. సీజన్ 3, 4, 5 ఇప్పుడు సీజన్ 6 ని కూడా పూర్తి చేశారు. వరుసగా నాలుగు సక్సెస్ ఫుల్ సీజన్ లు హోస్ట్ గా చేసిన నాగార్జున సీజన్ 7 కి హోస్ట్ గా చేయడం కష్టమే అంటూ డౌట్ రేజ్ అవుతుంది. సీజన్ 7కి దాదాపు రానాని ఓకే చేశారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే సీజన్ 7 కేవలం హోస్ట్ మాత్రమే కాదు ఛానెల్ కూడా మారుతుందని టాక్. స్టార్ మా నుంచి అది జీ తెలుగు లేదా.. జెమినికి గానీ వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.

సాధారణంగా ఇలాంటి రియాలిటీ షోస్ ని స్టార్ మా తర్వాత జీ తెలుగు ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది. సో జీ తెలుగులోనే బిగ్ బాస్ సీజన్ 7 నుంచి కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ వార్తలపై కన్ ఫర్మేషన్ రావాల్సి ఉంది. బిగ్ బాస్ అంటే స్టార్ మా.. స్టార్ మా అంటే బిగ్ బాస్ అనేలా చేశారు. మరి ఈ ఛానెల్ మార్పు ప్రోగ్రాం నిజమేనా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. ఏ ఛానెల్ అయినా టీం అదే కాబట్టి షోని ఇంకాస్త గొప్పగా ఉండేలా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి సీజన్ 7 లో మాత్రం బిగ్ బాస్ భారీ సర్ ప్రైజ్ లను ప్లాన్ చేస్తున్నారని టాక్.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: