
ఇప్పుడు తాజాగా తెలుగులో బిగ్ బాస్ ఆరవ సీజన్ కి కూడా హోస్టుగా నాగార్జున వ్యవహరించారు. అయితే ఆయన హోస్టింగ్ ప్రేక్షకులకు మింగుడు పడడం లేదు.. దీంతో విమర్శలు మొదలయ్యాయి. అందుకే ఆయనే ముందుగానే తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలోనే తెలుగులో ఏడవ సీజన్ నుంచి రానా దగ్గుబాటి హోస్టుగా రాబోతున్నారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే .. తమిళ్లో కూడా విశ్వ నటుడు కమలహాసన్ హోస్టింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఆయన కూడా హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్వాహకులతో చెప్పారని వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే తదుపరి ఎవరు హోస్టుగా నిర్వహిస్తారు అనే విషయం చర్చనీ అంశంగా మారింది.
అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం కమలహాసన్ హోస్టింగ్ కి గుడ్ బై చెప్పడంతో ఆస్థానాన్ని భర్తీ చేస్తూ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్ గా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే కమలహాసన్ కి అనారోగ్యంగా ఉన్నప్పుడు రమ్యకృష్ణ హోస్ట్ గా చేసింది. అప్పుడు ఆ ఎపిసోడ్లు బాగా సక్సెస్ అయ్యాయి. అందుకే మళ్ళీ ఆమెను తీసుకురావాలని అక్కడి నిర్వహకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కమలహాసన్ స్థానాన్ని భర్తీ చేస్తూ తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ బాధ్యతలు చేపట్టనుంది అని సమాచారం.