
భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి లాభాలను కూడా వసూలు చేసింది. తెలుగులో విడుదలవుతున్న చాలా సినిమాలకు అటు జపాన్ లో.. ఇటు రష్యాలో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాలో ఈ సినిమాను విడుదల చేయడం వెనుక ఆయన హస్తం ఉందని.. ఆయన బలవంతం వల్లే సినిమా రిలీజ్ చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. పుష్ప సినిమాను రహస్యాలు విడుదల చేయడానికి మేకర్స్ కి అల్లు అర్జున్ చెప్పాడు అని.. ఆయన బలవంతం వల్ల అక్కడ విడుదల చేసాము అని కూడా ఇటీవల చిత్ర మేకర్స్ ప్రకటించినట్లు సమాచారం.
ప్రస్తుతం అల్లు అర్జున్ అక్కడ విడుదల చేయగా ఆయన ఆశలు నెరవేరలేదు. మొత్తానికైతే ఇండియాలో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. రష్యాలో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు . ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నట్లు సమాచారం. మరియు ఈ సినిమాతో మరొక విజయాన్ని ఆయన తన ఖాతాలో వేసుకోబోతున్నారు. బాలీవుడ్ లో ఎటువంటి ప్రచారం చేయకనే భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న పుష్ప 2 తో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.