తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , గోపీ సుందర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటివరకు ఈ మూవీ నాలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ మూవీ వసూలు చేసిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నాలుగు రోజుల్లో ఈ మూవీ నైజాం ఏరియాలో 2.45 కోట్లు ... సీడెడ్ లో 48 లక్షలు ... యూఏ లో 55 లక్షలు ... ఈస్ట్ లో 34 లక్షలు ... వెస్ట్ లో 18 లక్షలు ... గుంటూరులో 22 లక్షలు ... కృష్ణాలో 17 లక్షలు ... నెల్లూరులో 12 లక్షలు ... మొత్తంగా కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులకు గాను ఈ సినిమా 4.51 కోట్ల షేర్ కలెక్షన్లను ,  8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 48 లక్షలు ... ఓవర్సీస్ లో 74 లక్షలు ... నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5.73 కోట్ల షేర్ , 11.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: