మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఈమె నటించిన పొన్నియన్ సెల్వన్, మట్టి కుస్తీ సినిమాలతో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఈమె.దీంతో ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది ఈమె. అయితే తాజాగా తన సోషల్ మీడియాలో నటుడు అర్జున్ దాస్ తో ప్రేమలో ఉన్నట్లుగా అధికారికంగా వెల్లడించింది.ఇక అర్జున్ తో  ఈమె కలిసి దిగిన ఒక ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ దాని కింద లవ్ సింబల్ ను జోడించింది. దీంతో ఆ ఫోటోను చూసిన ఈమె అభిమానులు చాలామంది కంగ్రాట్స్ చెబుతుంటే... 

మరికొందరు మాత్రం ఇది ఒక ప్రమోషన్ స్టంట్ అంటూ చెబుతున్నారు. త్వరలోనే ఇద్దరు ఏదైనా సినిమాలో నటిస్తున్నారు కాబోలు అందుకే ఇలాంటి ఫోటోను షేర్ చేశారు అంటూ చాలామంది కామెంట్లను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని అర్జున్  తో కలిసి మాస్టర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది ఈమె.ఈ క్రమంలోనే ఈయన బుట్ట బొమ్మ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ప్రేమ పెళ్లి ఇష్టమా లేదా పెద్దలకు చిన్న పెళ్లి ఇష్టమా అని అడుగుతే.. ఇందుకు ఈ  భామ షాకింగ్ జవాబును చెప్పింది ఐశ్వర్య లక్ష్మి.

అయితే తనకి పెళ్లంటేనే అసలు ఇష్టం లేదు అంటూ ఎవరూ ఊహించిన విధంగా చెప్పుకొచ్చింది ఐశ్వర్య లక్ష్మి. అయితే ఇలాంటి ఒక సమాధానాన్ని ఇచ్చిన నెల రోజులకే తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఒక పోస్ట్ ని పెట్టడంతో ఈ పోస్ట్ చూసిన వారందరూ షాక్ అవుతున్నారు .ఇక భవిష్యత్తులో వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటారా.. అన్నది చూడాలి. లేదా చాలామంది భావిస్తున్నట్లు ఇదేమైనా ప్రమోషన్ స్టంటా అన్నది కూడా తెలియాల్సి ఉంది. దీంతో ఐశ్వర్య లక్ష్మి చేసిన పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: