బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముందుగా హీరోయిన్ అవుదాము అన్న ఆశతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది యాంకర్ రష్మీ. హీరోయిన్ అవ్వాలి అని ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతుంది. మొదట జబర్దస్త్ తో ఈమె యాంకరింగ్ ను ప్రారంభించింది. అలా యాంకర్ గా మొదలైన తన ప్రయాణం ఇప్పుడు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది రష్మి. బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న యాంకర్లలో రష్మీ టాప్ ప్లేస్ లో ఉంది. హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్గా మాత్రం మంచి క్రేజ్ ను అందుకోలేకపోయింది రష్మి. 

అయినప్పటికీ ఎవర్ గ్రీన్ యాంకర్ గా చాలా హాట్ గా ఉంటుంది రష్మీ. ప్రస్తుతం ఈమె మల్లె మాలకి అంకితం అయిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యాంకర్ రష్మీ ప్రస్తుతం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకర్ గా వ్యవహరిస్తుంది. కెరియర్ పరంగా ఎప్పుడు సాఫ్ట్ గా ఉండే రష్మీ మూగజీవాలకు ఏదైనా హాని జరిగితే మాత్రం అసలు ఊరుకోదు. అది ఎవరైనా సరే ఎప్పటికప్పుడు వారిని ప్రశ్నిస్తూనే ఉంటుంది రష్మీ.తన సోషల్ మీడియా ద్వారా మూగజీవాల హింసపై ఎప్పటికప్పుడు వాదిస్తూనే ఉంటుంది రష్మి. అయితే తాజాగా సంక్రాంతి కానుకగా తాను కోడిపందాలలో గెలిచినట్టు నెటిజన్ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.

ఇక ఆ పోస్టును చూసిన రష్మి ఆయనపై ఒక రేంజ్ లో ఫైర్ అయింది. మూగజీవాలను హింసించి మీ పైశాచిక ఆనందం ఏంటి అంటూ నిలదీసింది .దాంతో ఆ పోస్టును చూసిన మరొక నెటిజన్ రష్మీ అసలు నీకు దమ్ముంటే జల్లికట్టుపై మాట్లాడు. ఒకవేళ నువ్వు అలా మాట్లాడితే తమిళనాడు వాళ్లు నిన్ను చెప్పులతో కొడతారు.. నీకు జీవితాన్ని ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీపై తెలుగు ప్రజలపై నీ ప్రతాపం చూపడం కాదు అంటూ గట్టి కౌంటర్ ని ఇచ్చాడు. ఇక దీనికి రిప్లై ఇచ్చింది రష్మీ. ఇందులో భాగంగానే తను మాట్లాడుతూ నోరులేని మూగజీవాలపైన మీ ప్రతాపం అంటూ ఆ నిజానికి రిప్లై ఇచ్చింది రష్మీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: