13 ఏళ్ల వయసులోనే  సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ జయసుధ. చాలా తక్కువ కాలంలోనే స్టార్ క్రేజ్ ను దక్కించుకుంది. తన సహజ నటనతో ఎందరినో ఆకట్టుకుంది ఈమె. 1972లో పండంటి కాపురం సినిమాతో ప్రేక్షకులను తన నటనతో మైమరిపించింది. దాదాపు అయిదు దశాబ్దాల పాటు రకరకాల పాత్రలలో నటించింది ఈమె. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలలో నటిస్తున్నారు జయసుధ. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ హిందీ భాషల్లో కూడా చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా జయసుధ మూడో పెళ్లి చేసుకుంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే కొద్దిరోజుల క్రితం అమె ఆమెరికాకు వెళ్ళింది.  ఇక అక్కడ ఒక బిజినెస్ మెన్ సీక్రెట్ గా వివాహం చేసుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జయసుధ అక్కడికి వెళ్లిన సదరు వ్యక్తి వెంట వస్తూ ఉండడంతో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇది నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేయగా ఇదంతా అబద్ధమని తేలిపోయింది. ఇందులో భాగంగానే జయసుధకి ఇప్పుడు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం అసలు లేదని చెప్పుకొచ్చింది. నాకు అసలు ఆ ఉద్దేశం ఈ లేనప్పుడు అసలు ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయో తెలియదు అంటూ పేర్కొంది జయసుధ. నిజానికి జయసుధ తో పాటు వస్తున్న ఆ వ్యక్తి అమెరికాకి చెందిన ఒక వ్యక్తి.

ఆయన ఒక ఫిలిం మేకర్.అయితే జయసుధ బయోపిక్ తీయాలి అని ఆయన కోరాడట దానికి జయసుధ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే జయసుధ బయోపిక్ కోసమే ఆయన జయసుధతో కొన్నాళ్లు ట్రావెల్ చేయాలని కోరాడటంతో దానికి ఒప్పుకుంది ఈమె. తెలుగు సినీ ఇండస్ట్రీలో అసలు జయసుధని ఎలా రిసీవ్ చేసుకుంటారు.. అక్కడ మీడియా ప్రతినిధులు ఎలా ఉంటారు.. షూటింగ్స్ ఎలా జరుగుతాయి.. అలాంటి విషయాలను అలాంటి విషయాలను తెలుసుకోవడానికి మరియు జయసుధ పబ్లిక్ లో బయటకు వస్తున్నప్పుడు పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు.. అని ఆయన కూడా జయసుధ వెంట వచ్చారని తెలుస్తోంది. అంతేకాదు ఈ బయోపిక్ జయసుధ సహా నిర్మాతగా వ్యవహరించబోతున్నారు అని తెలుస్తుంది. దీంతో జయసుధ పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు అని స్పష్టంగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: