సంక్రాంతి వార్ లో విజేతగా నిలిచిన ‘వాల్తేర్ వీరయ్య’ కలక్షన్స్ పరంగా సృష్టిస్తున్న సంచలనాలను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇప్పటికే ఈమూవీ 150 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను దాటి తన టార్గెట్ అయిన 200 కోట్ల ఫిగర్ వైపు పరుగులు పెడుతోంది.



వాస్తవానికి మొదట్లో ఈమూవీకి వచ్చిన డివైడ్ టాక్ విన్నవారికి ఈ రేంజ్ బ్లాక్ బష్టర్ హిట్ గా ఈమూవీ మారుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. చిరంజీవి మ్యానియాను మళ్ళీ నిలబెట్టిన ఈమూవీ వెనుక కొరటాల శివ ప్రోత్సాహం ఉంది అంటూ స్వయంగా దర్శకుడు బాబి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.



మూవీ కథ వ్రాస్తున్నప్పుడు తన మనసులో రవితేజపాత్ర అనుకోకుండా వచ్చిందని అయితే ఆవిషయం అప్పటికి తాను చిరంజీవికి కూడ చెప్పలేదని బాబి అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే తన మనసులోని ఆలోచనలను దర్శకుడు కొరటాల శివకు అప్పట్లో తాను షేర్ చేస్తే రవితేజా పాత్ర వల్ల ఈమూవీ కథకు మరింత బలం చేకూరుతుంది అని చెప్పి తనను కొరటాల ప్రోత్సహించిన విషయాలను బాబి గుర్తుకు చేసుకున్నాడు. దీనితో వీరయ్య సూపర్ సక్సస్ లో కొరటాల కు కూడ భాగం ఉంది అన్నవిషయం బాబి మాట్లాడిన మాటలు ద్వారా తెలిసింది.



చిరంజీవి తో కొరటాల తీసిన ‘ఆచార్య’ ఫ్లాప్ గా మారడంతో మెగా అభిమానులు అంతా కొరటాల పై అప్పట్లో తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచిన విషయం తెలిసిందే. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ తరువాత చిరంజీవి కూడ పరోక్షంగా ఆ ఫెయిల్యూర్ కు కొరటాల కారణం అని అర్థం వచ్చేడట్లుగా అప్పట్లో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే అలాంటి కొరటాల సలహాలు దర్శకుడు బాబికి ‘వాల్తేర్ వీరయ్య’ కథ విషయంలో ఉన్నాయి అని తెలిసినప్పుడు సినిమాల సక్సస్ ఫెయిల్యూర్ లు ఎవరి చేతిలోనూ ఉండవు అన్నవిషయం మరొకసారి రుజువైంది..  




మరింత సమాచారం తెలుసుకోండి: