కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని షారుఖ్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆయన్ని చాలా గ్రాండ్ గా మళ్ళీ స్వాగతించేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు.ఇక ఈ సినిమా కేవలం హిందీలోనే కాకుండా.. తెలుగు ఇంకా తమిళ భాషల్లో కూడా జనవరి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాలుగేళ్ల విరామం తర్వాత.. పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ మళ్ళీ వస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.2022 వ సంవత్సరంలో హిందీ చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదని చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరంపై బాలీవుడ్ కన్నేసింది. ఈసారైనా ఎలాగైనా హిట్స్ పడాలని ఆత్రంగా చూస్తోంది. ఇక షారుఖ్ ఖాన్ కూడా పఠాన్ సినిమాపైనే చాలా అంచనాలు పెట్టుకున్నారు. పఠాన్ సినిమాతో 2023 లో మంచి హిట్ దక్కుతుందని ఆయన ఇంకా ఆయన అభిమానులు భావిస్తున్నారు.


సినిమా మొదటి రోజు వసూళ్ల మీద ట్రేడ్ విశ్లేషకులు చర్చలు చేస్తున్నారు. 45 నుంచి 60 కోట్ల రూపాయల వసూళ్లు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాని బాహుబలి 2మెుదటి రోజు కలెక్షన్స్ తో పోల్చుతున్నారు.ఇక హిందీలో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్లు సాధించిన సినిమాగా బాహుబలి 2 చెరపలేని పేరు తెచ్చుకుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ ఫస్ట్ డే 41 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమా రికార్డును షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా ఈజీగా బద్దలు కొడుతుందని చాలా మంది అనుకుంటున్నారు. ఈ మూవీ మేకర్స్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు.41 కోట్లపైనే మెుదటి రోజు కలెక్షన్స్ ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉంటాయని అంటున్నారు.మరి చూడాలి పఠాన్ బాహుబలి 2 సినిమా రికార్డులను ఏమాత్రం బద్దలు కొడుతుందో.. తన పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటుందో లేదో చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: