సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేటిజన్స్  దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి చైల్డ్ హుడ్  ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు కొన్ని ఇక అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అయితే ఇలాంటి ఫోటోలు అటు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.


 ఇక ఇటీవలే వైరల్ గా మారిపోయిన వీడియోలో ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తూ ఉన్నారు. అన్నయ్య తమ్ముడిని ఎంతో ప్రేమగా తన చేతుల్లో ఎత్తుకున్నాడు. దీంతో వారి మధ్య ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయి అన్నది ఇక ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు కూడా ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఫోటో చూసిన తర్వాత మాత్రం ఇక ఇందులో ఉన్న స్టార్ హీరోలు ఎవరు అన్నది గుర్తుపట్టలేకపోతున్నారు ఎంతో మంది అభిమానులు.

 ఇంతకీ ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన ఫోటోలో  ఉన్న స్టార్ హీరోలు ఎవరు అంటే.. వాళ్ళు ఎవరో కాదు మెగా ఫ్యామిలీ నుంచి వారసులుగా ఎంట్రీ ఇచ్చి ఇక ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. రామ్ చరణ్ ను వరుణ్ ఎత్తుకొని ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల వరుణ్ తేజ్ తన పుట్టినరోజును జరుపుకొగా.. రామ్ చరణ్ ఈ ఫోటోని షేర్ చేశాడు.. దీంతో ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ప్రస్తుతం ఇద్దరు హీరోలు కూడా తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: