మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , మైత్రి సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా , రవితేజ కు భార్య పాత్రలో కేథరిన్ ఈ సినిమాలో నటించింది. ఈ సినిమాను జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. సినిమా ఇప్పటివరకు 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి పది రోజుల్లో నైజాం ఏరియాలో 31.45 కోట్లు , సీడెడ్ లో 16.08 కోట్లు ,  యుఏ లో 14.39 కోట్లు ,  ఈస్ట్ లో 9.87 కోట్లు , వెస్ట్ లో 5.49 కోట్లు గుంటూరు లో 7.16 కోట్లు కృష్ణ లో 6.94 కోట్లు , నెల్లూరు లో 3.65 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 7.35 కోట్లు , ఓవర్సీస్ లో 11.75 కోట్లు మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 10  రోజుల్లో 114.13 కోట్ల షేర్ , 195.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఇలా వాల్తేరు వీరయ్య సినిమా 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 25.3 కోట్ల లాభాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: