
ప్రేక్షకులకు సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ పంచడమె లక్ష్యంగా ప్రతి సీజన్లో టీం లీడర్లను కూడా మారుస్తూ వస్తున్నారు షో నిర్వాహకులు. అయితే ఇక ఢీ 15వ సీజన్లో హైపర్ ఆదికి తోడుగా కో టీం లీడర్ గా జెస్సీ ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైపర్ ఆది జెస్సీ మధ్య జరిగే సంభాషణల ఆధారంగా కామెడీ క్రియేట్ చేసి ప్రేక్షకులను నవ్వించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతకు ముందులా మాత్రం ఎందుకో కామెడీ పండడం లేదు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.
ఇకపోతే వచ్చేవారం ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఇక ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ప్రోమో చూసిన తర్వాత టీం లీడర్ గా పిలిచి బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సిని అవమానిస్తున్నారా అనే భావన అందరిలో కలుగుతుంది. ఎందుకంటే గత ఎపిసోడ్లో బెండకాయని లేడీ ఫింగర్ అనడానికి బదులు జెస్సి ఫింగర్ అని ఇండైరెక్టుగా జెస్సి మగ కాదు ఆడ అని కామెంట్ చేశాడు హైపర్ ఆది. ఇక ఇటీవల విడుదలైన ప్రోమోలో ఏకంగా శేఖర్ మాస్టర్ డైరెక్ట్ గానే నువ్వు మగ కాదు ఆడవే అంటూ కించపరిచేలా కామెంట్ చేశాడు. దీంతో ఇది చూసిన జెస్సి అభిమానులు షోకి పిలిచి ఇలా అవమానించడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు.