అప్పుడప్పుడు కొంతమంది సినీ సెలబ్రిటీలు బుల్లితెర సెలబ్రిటీలు సైతం అభిమానులకు సడన్ షాక్ లు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ వ్యక్తిగత విషయంలో మాత్రం అభిమానులను ఆశ్చర్యపరిచే విషయాలను తెలియజేస్తూ ఉంటారు. తాము ఎవరినైనా లవ్ చేస్తున్న వివాహం చేసుకుంటామని తెలిపిన చాలు వెంటనే అభిమానులు తెగ బాధపడుతూ ఉంటారు. ఇప్పటికీ ఎంతమంది సెలబ్రిటీలు సైతం తమ ఫ్యాన్స్ ని ఇలానే బాధపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా యంగ్ హీరోయిన్ వర్ష బోలమ్మ కూడా అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే తమిళ ,మలయాళ ఇండస్ట్రీకి చెందిన వర్ష బోలమ్మ తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా తన అందంతో యువతను బాగా ఆకట్టుకుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది వర్ష. తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. 2018లో కళ్యాణం సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది.
పలు వెబ్ సిరీస్ లతోపాటు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా గెస్ట్ గా పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు ఎలాంటి గ్లామర్ షో కూడా చేయలేదు. అప్పుడప్పుడు కేవలం ఇంట్రెస్టింగ్ పోస్టులు మాత్రమే షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఒక స్టోరీని పంచుకుంది. అందులో తన సెల్ఫీ వీడియోస్ షేర్ చేస్తూ వెడ్డింగ్ ఫోటోషూట్ ఫీల్స్ కానీ అది నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అంటూ క్యాప్షన్ రాసుకుంది. మొదట వెడ్డింగ్ ఫోటోషూట్ అనగానే అభిమానులు కాస్త షాక్ అయ్యారు కానీ మళ్ళీ పూర్తి చూసిన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: