
చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత తనకు ఆచార్య సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన కొరటాల శివ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కొరటాలను ఉద్దేశించి కాదు అక్కినేని హీరో అఖిల్ సినిమాను ఉద్దేశించి అన్నది మాత్రం అర్థం అవుతుంది. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ ఎన్నో కారణాలతో ఇంకా విడుదల వాయిదా పడుతూ వస్తూనే ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి పూర్తి కాలేదు.
అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన యాక్షన్ సిక్వెన్స్ ఇప్పటికే తెరకెక్కించారట. కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ అవుట్ ఫుట్ ఎవరికి నచ్చకపోవడంతో దాని పక్కన పెట్టేసి ఇక ఇప్పుడు అరేబియాలోని మస్కట్ వెళ్లి 15 రోజులు పాటు అక్కడ మళ్లీ షూటింగ్ చేయబోతున్నారట. అయితే గతంలో షూటింగ్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారట. ఈ నేపథ్యంలోనే అయితే మెగాస్టార్ చురకలాంటించింది సురేందర్ రెడ్డి కి అన్నది తెలుస్తుంది. మెగాస్టార్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సైరా నరసింహారెడ్డి వచ్చింది. ఇక అప్పుడు సురేందర్ రెడ్డి ఇలాగే చేసి ఉంటాడని.. అది గుర్తుతెచ్చుకొని చిరంజీవి అలా అని ఉంటారు అని కొంతమంది భావిస్తున్నారు.