
అయితే ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్ర బృందం బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ కుడి చేతి పై ఉన్న టాటూ గురించిన వార్త ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరు తమ ప్రియమైన వారి పేర్లను చేతిపై టాటూ వేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక అందుకు సినీ సెలబ్రిటీలు ఏమి మినహాయింపు కాదు. కాగా కళ్యాణ్ రామ్ కుడి చేతి పై స్వాతి అనే పేరుతో టాటు ఉంటుంది.
అయితే ఈ టాటూ గురించి ఇక ఇటీవలే అమిగోస్ ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. కళ్యాణ్ రామ్ కుడి చేతి మీద ఉన్న స్వాతి అనే పేరు ఎవరిదో కాదు కళ్యాణ్ రామ్ సతీమణిది. ఈ టాటూ వెనక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ రామ్. 2007 మధ్యలో నేను తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాను. ఇక ఆరోగ్యం బాగా చెడిపోయింది. ఆ సమయంలో స్వాతి అన్ని తానై దగ్గరుండి చూసుకుంది. నాకు తల్లిలా సేవలు చేసింది. తన కేరింగ్ వల్లే మళ్ళీ ఆరోగ్యవంతుడిగా మారాను. ఇక నా భార్యపై ఉన్న ప్రేమతోనే ఇలా పచ్చబొట్టు వేయించుకున్నాను. నేను ఇంజక్షన్ అంటేనే భయపడే వాడిని.. కానీ ఆ భయాన్ని కూడా తన ప్రేమతో అధిగమించేలా చేసింది అంటూ ఇక కళ్యాణ్ రామ్ తన భార్యపై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చాడు.