టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంది సమంత. ఇప్పుడు మయోసైటీస్ నుంచి కోలుకొని బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీ కానుంది. ఇటీవలే సమంత 'సిడాటెల్' అనే హిందీ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ముంబై వెళ్ళిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ మెన్2 వెబ్ సిరీస్ నీ డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇది ఇంగ్లీష్ సిడాటెల్ సిరీస్ కి రీమేక్ గా రూపొందుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో సమంత, వరుణ్ ఇద్దరు కూడా స్పైగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన సమంత అక్కడే కొత్తగా ఇల్లు కొనుక్కొని అక్కడే ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి.వెబ్ సిరీస్ తో పాటూ హిందీలో మరికొన్ని సినిమాలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే కొంతకాలం ముంబై కి షిఫ్ట్ అవ్వాలనుకుంటుందట. ఇక మరోవైపు విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న 'ఖుషి' మూవీ షూటింగ్ కూడా సమంత కారణంగానే ఆలస్యమవుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత జిమ్ లో భారీ వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఇక ఈ వీడియోలో సమంత చాలా సీరియస్ గా వర్కవుట్స్ చేస్తుంది. ఆ సమయంలో తన పెట్ డాగ్ సమంతని తడుముతూ అలా చూస్తూ ఉండిపోయింది.

దీంతో ప్రస్తుతం సమంత లేటెస్ట్ జిమ్ వర్కౌట్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ వర్కౌట్స్ అన్ని బాలీవుడ్ వెబ్ సిరీస్ సీడాటెల్ కోసమే అని తెలుస్తోంది. ఇక ఈ వీడియోతో పాటు తన న్యూట్రిషన్ డైట్ గురించి కూడా పోస్ట్ చేసింది సమంత. ప్రస్తుతం సమంతా జిమ్ వర్కౌట్స్ వీడియోని చూసిన నెటిజన్స్ ఆమె డెడికేషన్ కి ఫిదా అయిపోతున్నారు.కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ 'శాకుంతలం' ఫిబ్రవరి 17న విడుదల కావలసి ఉండగా చివరి నిమిషంలో సినిమా విడుదలను వాయిదా వేశారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరి వారంలో సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: