సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీని దక్కించుకున్న వారిలో ఆషు రెడ్డి కూడా ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై సెలబ్రిటీగా కొనసాగుతోంది. సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేసంపాదించుకున్న ఈమె.. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి రెండుసార్లు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా పలువురు సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఫేమస్ అయింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం బోల్డ్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది ఆషు రెడ్డి. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మతో జరిగిన ఇంటర్వ్యూ ద్వారా ఈమె చేసినా రచ్చ అంతా కాదు. ఆ ఇంటర్వ్యూలో ఆషురెడ్డి తన అందాలను రెచ్చిపోయి మరి చూపించింది. 

అంతేకాదు ఇదే ఇంటర్వ్యూ ద్వారా ఈ అమ్మడు భారీ ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొంది. అయినా కూడా గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. అలా వరుస ఫోటోషూట్స్, బోల్డ్ ఇంటర్వ్యూస్ తో నానా రచ్చ చేస్తున్న ఆషు రెడ్డి తాజాగా స్కిన్ టైట్ డ్రెస్ ధరించి తన బ్యాక్ చూపిస్తూ షాకింగ్ కామెంట్ చేసింది. 'జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నా వెనకే మాట్లాడతారుగా' అంటూ తన బ్యాక్ ని చూపిస్తున్న ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటో కాస్త క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ఫోటోని చూసిన కొంతమంది నేటిజన్లు ఆషు రెడ్డి పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొంతమందిని నెటిజన్స్ నీ బ్యాకే కాదు నీ ఫ్రెంట్ కూడా మాకు ఇష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో ఆషు రెడ్డి ఈ మధ్యకాలంలో నువ్వు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే అవకాశాల కోసం ఏదైనా చేస్తావా అంటూ ఆషు రెడ్డి పై ఫైర్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఆషు రెడ్డి బుల్లితెరపై ప్రసారమయ్యే పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇక ఆ మధ్య స్టార్ మా లో ప్రసారమైన కామెడీ స్టార్స్ షోలో ఎక్స్ ప్రెస్ హరి తో కలిసి లవ్ ట్రాక్ మైంటైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ లవ్ ట్రాక్ వల్ల ఆషు రెడ్డికి సోషల్ మీడియాలో మరింత క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ టీవీ షోస్ తో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: