డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరియర్ లో నే ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా మహేష్ బాబు పోకిరి... పూరీకి మాత్రమే కాదు మహేష్ బాబు కెరియర్ కి కూడా ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడిందనే చెప్పవచ్చు..అప్పటి దాకా చాక్లెట్ బాయ్ లా ఉన్న మహేష్ బాబుని ఒక్కసారి గా ఊర మాస్ హీరోగా మార్చాడు పూరి...ఇక అప్పటి నుంచి మహేష్ బాబు కెరియర్ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగింది.

సినిమా దాదాపు 50 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని తెలుస్తుంది.అప్పట్లో ఇవే హైయెస్ట్ కలెక్షన్స్ అని కూడా చెప్పవచ్చు...అంత పెద్ద విజయం సాధించిన ఈ సినిమా లో క్లైమాక్స్ కొద్దిగా మార్చకపోతే సినిమా ప్లాప్ అవుతుందని ఈ సినిమా ఎడిటర్ అయిన మార్తాండ్ కే వెంకటేష్ చెప్పాడనీ దాంతో పూరి కొద్దిగా ఆలోచించి మహేష్ బాబు ఇందులో పోలీస్ అనే ఆ ట్విస్ట్ ని రివిల్ చేయడాన్ని

హైలెట్ చేశాడనీ తెలుస్తుంది.దీనికి ముందు వేరే క్లైమాక్స్ అనుకున్నప్పటికీ కూడా మార్తాండ్ కె వెంకటేష్ చెప్పిన మార్పులని స్వీకరిస్తూ పూరి దాన్ని కొంచం మార్చడం తో సినిమా అందరికీ కూడా బాగా నచ్చింది. ముఖ్యం గా ఆ ప్రి క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం అప్పటి వరకు ఏ సినిమాలో కూడా చూడని విధంగా కొత్తగా అయితే డిజైన్ చేసాడు పూరి...ఈ సినిమాని బేస్ చేసుకొని టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి.. ఇప్పటికీ కూడా వస్తున్నాయి అయితే పూరి తన కెరియర్ మొత్తం లో కూడా ఇప్పటి వరకు ఇంత మంచి బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం ఇంకొకటి చేయలేదు...ప్రస్తుతం పూరి స్టోరీలు రాసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు మళ్ళీ తొందరలోనే ఒక మంచి కథ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.. మరి పూరి ఈసారి అయిన ఒక మంచి ఇండస్ట్రీ హిట్ కొట్టే కధ తో వస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: