సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న  నయనతార.. ప్రస్తుతం కోలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్ గా కెరీర్ ను సాగిస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలో నటిస్తోంది. అయితే తమిళ అగ్ర హీరో అజిత్, డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందని ఉందని ఇప్పటికే కొన్ని వార్తలు వినిపించగా.. ఆ ప్రాజెక్ట్ మాత్రం కొన్ని కారణాలవల్ల క్యాన్సిల్ అయిపోయింది. అంతేకాదు ఆ ప్రాజెక్టు ఆగిపోవడంతో డైరెక్టర్ విగ్నేష్ శివన్ డిప్రెషన్ కి కూడా గురయ్యారని కామెంట్లు కూడా వ్యక్తం అయ్యాయి.

అయితే తాజాగా తన భర్తకు భారీ అవమానం జరగడంతో ఇకనుంచి తాను అజిత్ కు జోడిగా నటించకూడదని నయనతార ఫిక్స్ అయిందట. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే అజిత్ సినిమాలో తాను నటించకూడదని ఆమె గట్టిగా ఫిక్స్ అయిందని కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో అజిత్ - నయన్ కాంబినేషన్ కు బ్లాక్ బాస్టర్ కాంబో అనే పేరు ఉంది. అజిత్ - నయన్ కాంబోలో తెరకెక్కిన సినిమాలు అంచనాలకు మించిన విజయాలను అందుకున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం నయనతార అజిత్ తో నటించకూడదని ఫిక్స్ అయిపోయిందట.ఇక ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై నయనతార నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు పదికోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఎటుహిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా నయనతార ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెకు తెలుగులో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. అయితే ఈమెకు సౌత్ లో ఊహించి ని రేంజ్ లో క్రేజ్ ఉండడంతో నయనతారకు ఆఫర్స్ పెరుగుతున్నాయి గానీ తగ్గడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన సరసన నటిస్తోంది నయనతార. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న 'జవాన్' సినిమాలో షారుక్ - నయన్ జోడీగా కనిపించనున్న విషయం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: