
దాంతో అనిల్ రావిపూడి ఈ కథని మంచు విష్ణు తో చేద్దాం అనుకొని ఆయనకి స్టోరీ చెప్పాడట ఆయనకు ఈ స్టోరీ నచ్చినది ఐనప్పటికి తను ఈ స్టోరీ లో కొంచం మార్పులు చేయమని చెప్పాడట ఐతే వాటిని మార్చడం ఇష్టం లేని అనిల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడటా. ఇకపొతే మళ్ళా ఇదే స్టోరీ పట్టుకుపోయి రానా దగ్గుబాటి దగ్గరికి వెళ్లి ఈ కథ చెబితే ఆయన అప్పటికే బాహుబలి మూవీ బిజీలో ఉండటం వల్ల ఆయన కొద్దిరోజులు వెయిట్ చేయమని చెప్పాడట. ఐతే ఆ స్టోరీ అనిల్ రాసుకొని అప్పటికే రెండు సంవత్సరాల నుంచితెగ ట్రై చేస్తున్న ఏది వర్కౌట్ కాలేదు ఇంకా ఆపడం అంటే నావల్ల కాదు అని అనిల్ చెప్పి లాస్టుగా కళ్యాణ్ రామ్ కి కథ వినిపించాడట కళ్యాణ్ రామ్ కి కథ బాగా నచ్చి సినిమా చేద్దాం అని చెప్పి మూవీ ని స్టార్ట్ చేశారు.
ఐతే ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చి కళ్యాణ్ రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఐతే అప్పట్లో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ కి ఈ మూవీ తో ఒక మంచి హిట్ పడిందనే చెప్పాలి. దాంతో కళ్యాణ్ రామ్ మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తన కంటు ఒక మంచి ఇమేజ్ తో ముందుకు సాగిపోతున్నాడు.ఆ జర్నీలోనే ఇటీవల వచ్చిన బింబిసార మూవీ తో ఇంకో మెట్టు ఎక్యాడని చెప్పాలి. అలాగే ఈ మధ్య వచ్చిన అమిగోస్ మూవీ కూడా మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకు పోతుంది.