నందమూరి తారకరామారావు పేరు వినగానే ఎవరికైనా ఆయన పోషించిన శ్రీరాముడు శ్రీకృష్ణుడు పాత్రలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఆయన మరణించిన తరువాత చాలామంది హీరోలు పురాణ పాత్రలను చేయడానికి ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు పెద్దగా సఫలం కాలేదు. ఆఖరికి బాలకృష్ణ ‘శ్రీరమరాజ్యం’ లో రాముడుగా నటించినా ఆమూవీ చెప్పుకోతగ్గ స్థాయిలో విజయవంతం కాలేదు.


దీనితో సీనియర్ యన్టీఆర్ పౌరాణిక వారసత్వాన్ని పూర్తిగా బాలయ్య అందుకోలేకపోయాడు అన్నమాటలు కూడ వినిపించాయి. ప్రేక్షకుల అభిరుచి మారడంతో పౌరాణిక సినిమాలు కూడ పూర్తిగా తగ్గిపోయాయి. అయితే మళ్ళీ పౌరాణిక సినిమాల ట్రెండ్ కు త్రివిక్రమ్ జూనియర్ల ప్రయత్నంతో మళ్ళీ ఇండస్ట్రీలో పాతరోజులు రాబోతున్నాయా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి.


తెలుస్తున్న సమాచారంమేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ త్రివిక్రమ్ జూనియర్ లతో కలిసి ఒక భారీ పౌరాణికి సినిమాను త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ లో రూపొందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టడంతో త్రివిక్రమ్ ఒక పౌరాణిక కథను ఎంచుకుని దానిని ఇప్పటితరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మించే విషయంలో ఇప్పటికే జూనియర్ త్రివిక్రమ్ ల మధ్య ఒక అవగాహన కుదిరి అందరికీ తెలిసిన ఒక పౌరాణిక గాథను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో నిర్మాణం చేసేందుకు ఒక ప్రాధమిక ఆలోచనతో అడుగులు పడుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి.


ఈమూవీ కధలో జూనియర్ కు కీలక పాత్ర ఉండటమే కాకుండా ఈమూవీ కథ చాల డిఫరెంట్ గా ఉంటుంది అని అంటున్నారు. అంతేకాదు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఈమూవీ గతంలో ఎన్టీఆర్ నటించిన ‘దానవీర సూరకర్ణ’ మూవీలా జూనియర్ తో మూడు పాత్రలు చేయించే విధంగా ఉండవచ్చు అన్నసంకేతాలు కూడా వస్తున్నాయి. గతంలో జూనియర్ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఎప్పటికైనా తన తాత నటించిన ‘దానవీర శూరకర్ణ’ మూవీని రీమేక్ చేయాలని తన కోరిక అని చెప్పాడు. ఇప్పుడు అదే సినిమాను రీమేక్ చేస్తున్నాడా అన్న సందేహాలు కలగడం సహజం..




మరింత సమాచారం తెలుసుకోండి: