తమిళ్ ఇండస్ట్రీ లో హీరో విజయ్ ఉన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేసిన సినిమాలు తెలుగు లోకి డబ్ అవ్వడం గూర్చి మనకు తెల్సు. కానీ మొదటిసారి నేరుగా తెలుగు లో తీసిన మూవీ వారసుడు.ఆ మూవీని డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అందుకుంది.
ఐతే ఇందులో విజయ్ తో కలసి రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ మూవీని తెలుగుతోపాటు,తమిళంలోనూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఐతే ఆల్ మోస్ట్ థియేట్రికల్ రన్ ను ముగించుకున్న ఈ బ్లాక్బస్టర్ మూవీ ఓటీటీలో రిలీజ్ కోసం ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
          ఐతే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే ముందు ఈ మూవీను మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు కానీ మూవీ మేకర్స్ , ఇప్పుడు సినీ ప్రియులకు సర్ ప్రైజ్ ఇస్తూ ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి తీసుకొచ్ఛారు. తెలుగు,తమిళ,మలయాళంతో పాటు కన్నడలోనూ కూడా ఈ మూవీ  స్ట్రీమింగ్ అవుతుంది. ఐతే దీంతో ఇప్పటివరకు థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు అందరూ ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు.
         ఐతే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు మరియు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. వారసుడు తో సూపర్ హిట్ అందుకున్న విజయ్ ప్రెసెంట్  డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో  ఇంకో  ప్రాజెక్ట్  చేస్తున్నారు.

ఏదేమైనా హీరో విజయ్ డైరెక్ట్ గా తెలుగు లో చేసిన మూవీ కనుక విజయ్ అభిమానులే కాదు తెలుగు మూవీ లవర్స్ కూడా ఈ సినిమా ఓటీటీ లో చూడడానికి ఆసక్తి చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: