
ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమా స్పై యాక్షన్ త్రిల్లర్గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఎన్నోసార్లు విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదు. అందుకే ఈ సినిమా రిలీజ్ చేయాలని సినిమా పర్ఫెక్ట్ గా వచ్చేవరకు ఎదురుచూస్తున్నారు చిత్ర బృందం. ఏప్రిల్ 28వ తేదీన భారీ స్థాయిలో తెలుగు, తమిళ్ ,మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే భారీ భజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో పాటు కర్ణాటకలో కూడా థియేట్రికల్ హక్కులను నిర్మాత అనిల్ సుంకర హోల్సేల్గా అమ్మేశారట. దీంతో వితౌట్ జీఎస్టీతో ఈ సినిమా రూ.34 కోట్ల రూపాయలకు అమ్మేసినట్లు సమాచారం. అయితే థియేటర్ రైట్స్ కోసం చాలామంది పోటీపడుతున్న భారీ మొత్తానికి ఏరియా వైజ్ గా థియేట్రికల్ హక్కులను అమ్మేసిన నిర్మాత ఈ సినిమాకి రూ .15 కోట్ల డెఫిషీట్ తో రిలీజ్ చేస్తూ ఉండడంతో ట్రెండ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారుతోంది.ఈ సినిమా తక్కువ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ వస్తే ఈ సినిమాకు మంచి టాక్ వస్తే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.