ఈ నగరానికి ఏమైంది మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించు కొని ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత ఫలక్ నామ దాస్ అనే మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఆ మూవీ కి దర్శకత్వం కూడా వహించి ఇటు హీరో గా ... అటు దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఫలక్ నామ దాస్ మూవీ లో హీరో గా నటించి ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించి తన ప్రతిభను నిరూపించుకున్న విశ్వక్ ప్రస్తుతం దాస్ కా దంకి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి కూడా విశ్వక్ దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషం. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో పాగల్ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా వీరిద్దరు కాంబినేషన్ లో రూపొందుతున్న రెండవ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ... వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ తో విశ్వక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: