ఈ నెలాఖరుకు విడుదల కాబోతున్న ‘దసరా’ మూవీ పై నాని చేస్తున్న హడావిడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈసినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ నాని చాల ముందుగానే రేడీయో ఇంటర్వ్యూలు ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు మొదలు పెట్టేసాడు. ప్రస్తుతం నానికి ఈసినిమా బ్లాక్ బష్టర్ హిట్ అయి తీరాలి. వాస్తవానికి నాని కి మాస్ హీరోగా మారాలని అతని డ్రీమ్.



ఈ ప్రయత్నంలో గతంలో అతడు చేసిన మాస్ ప్రయోగాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. అయినప్పటికీ ఒక కొత్త దర్శకుడుని నమ్ముకుని నానిసినిమా పై 70 కోట్లు ఖర్చు పెట్టించాడు అని అంటారు. ఈమూవీ బడ్జెట్ అంచనాలు దాటిపోవడంతో ఈమూవీ నిర్మాతకు ధైర్యం కలిగించడానికి తన పారితోషికాన్ని ఈమూవీ విడుదల తరువాత తీసుకుంటాను అని చెప్పి ఆ నిర్మాతకు జోష్ ను కలిగించాడు అని కూడ వార్తలు ఉన్నాయి.



ఈమూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తూ ఉండటంతో ఈమూవీ ప్రమోషన్ కోసం నాని తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలలో ఉన్న కాలేజీలకు వెళ్ళి ఈసినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. నాని సినిమాలకు కథల విషయంలో లోటు లేకపోయినా హిట్ అన్న పదం ఆయన దరికి చేరడం లేదు. ‘వి సినిమా ఓటిటికి వెళ్లింది ‘టక్ జగదీష్’ కూడా అదే బాట పట్టింది. ‘శ్యామ్ సింగరాయ్’ మంచి ప్రశంసలు వచ్చాయి కానీ నిర్మాతకు లాభాలు రాలేదు.




వాస్తవానికి ‘దసరా’ మూవీ డబ్బింగ్ రైట్స్ కు బాలీవుడ్ లో ఇచ్చేసి ఉంటే నిర్మాతకు కొంత భారీ మొత్తంలో డబ్బు వచ్చి ఉండేది. అయితే నాని మితిమీరిన నమ్మకంతో ఈమూవీని హిందీలో కూడ రిలీజ్ చేయిస్తున్నాడు. దీనితో ఈసినిమాను హిట్ చేయవలసిన బాధ్యత నాని పై ఉన్నప్పటికీ ఈసినిమాకు సరైన టాక్ వచ్చినప్పుడు మాత్రమే ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారు. అది మాత్రం జరగకుండా ఎంత ప్రమోట్ చేసినా సినిమాలో విషయం లేకపోతే జనం ధియేటర్లకు రారు అన్న విషయం నానికి తెలిసే ఉంటుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: